Samantha: అలా చేసినందుకు కోట్లలో నష్టపోయా.. సమంత సంచలన కామెంట్స్!

Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2025-04-13 04:10 GMT
Samantha: అలా చేసినందుకు కోట్లలో నష్టపోయా.. సమంత సంచలన కామెంట్స్!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత సంచలన కామెంట్స్ చేశారు. తాను బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తీసుకోవడంలో తన బాధ్యతల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యలో తెలిపింది. ఆయా బ్రాండ్స్ తో తన విలువలు అమరిక గురించి తాను మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో చెప్పుకొచ్చింది. ఇతరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూసే సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. అందులో భాగంగానే గత ఏడాది 15 బ్రాండ్స్ కు తాను నో చెప్పినట్లు వెల్లడించింది. అయితే దీని వల్ల తాను కోట్లలో నష్టపోయినట్లు పేర్కొంది.

నేను నా 20 ఏళ్లలో ఈ పరిశ్రమలోకి ప్రవేశించాను. అప్పుడు మన చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్ని బ్రాండ్స్ ఆమోదించారు. ఎన్ని బ్రాండ్స్ వారి ఉత్పత్తులపై మీ ముఖాన్ని కోరుకుంటున్నారు అనేదానిపై విజయం ఆధారపడి ఉండేదని సమం తెలిపారు. కానీ నేడు నేను ఇంతకంటే తప్పుగా ఉండలేనని గ్రహించాను. నా ఎంపికలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే సరైన మార్గాన్ని అనుసరించాలని నేను అనుకున్నాను. అర్థం లేని పనులు చేసినందుకు ఇప్పుడున్న సమంతకు, పాత సమంతకు క్షమాపణ చెప్పాలని నేను భావిస్తున్నాను. అందుకే నా యంగ్ ఫాలోవర్స్ కు 20లలోనే తాము అజేయులని అనుకోవద్దని విజ్నప్తి చేయాలనుకుంటున్నాను . అది కాదని నేను నేర్చుకున్నాను. ఆ ఎండార్స్ మెంట్స్ చాలా క్రితం జరిగాయి. నేను గత ఏడాది 15 బ్రాండ్స్ ను వదలుకున్నా. రూ. కోట్ల డబ్బులు కూడా వదులుకున్నా. ఇప్పుడు ఎండార్స్ మెంట్ వచ్చిన ప్రతిసారీ నేను దానిని ఆమోదించేందుకు అంగీకరించే ముందు ముగ్గురు వైద్యులతో ఆ బ్రాండ్స్ ను చెక్ చేస్తాని అని సమంత తెలిపారు.

కాగా 2022లో సమంతకు మైయెసిటిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీంతో కొన్నాళ్లపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి కుషి మూవీలో నటించారు. అనంతరం వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హన్నీ బన్నీలో కనిపించారు. ఇప్పుడు రాజ్ అండ్ డికే ద్వారా రక్త్ బ్రహ్మండ్ , మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టుల షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News

Anushka Sen