SAMANTHA ఈజ్ బ్యాక్.. పిక్ బాల్ గేమ్ అదరగొట్టిన సామ్.. ఆ ఎనర్జీ చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో)

మయోసైటిస్ బారిన పడి సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న సమంత.. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకోని యాక్టీవ్ అవుతుంది.

Update: 2024-08-28 03:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: మయోసైటిస్ బారిన పడి సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న సమంత.. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకోని యాక్టీవ్ అవుతుంది. అంత బాధలో ఉన్నా కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వర్క్‌వుట్ వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉండేది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సామ్ ఫిట్‌నెట్ చూస్తుంటే అందరు వావ్ అంటున్నారు. మొన్నటి వరకు బెడ్డు మీద నుంచి నడవలేని స్థితి నుంచి ఇప్పుడు సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం సామ్ లుక్, ఫిట్ నెస్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది.

సమంత తన స్నేహితులతో కలిసి ఫుల్ జోష్‌లో పికిల్ బాల్ గేమ్ ఆడుతూ కనిపించింది. ఈ వీడియో చూస్తే ఈ అమ్మడు ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉందని అర్థమవుతుంది. ఈ గేమ్ పూర్తైన తర్వాత డాన్స్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి స్టేడియంలో పలువురు ఛాంపియన్లతో కలిసి ఆమె ఓ మ్యాచ్ ఆడారు. కాగా ప్రస్తుతం సామ్ ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రాబోతుంది.

(video link credits to 𝐓𝐍 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚 𝐅𝐚𝐧𝐬 X account)


Similar News