Saiee Manjrekar: మీ అమ్మ ప్రేమను పొందాలంటే ఈ టిప్స్ చాలా అవసరం.. క్యూట్ వీడియో షేర్ చేసిన యంగ్ హీరోయిన్

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటిస్తున్న లేటెస్ట్ హై ఓల్టేజ్ చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’

Update: 2025-04-15 14:51 GMT
Saiee Manjrekar: మీ అమ్మ ప్రేమను పొందాలంటే ఈ టిప్స్ చాలా అవసరం.. క్యూట్ వీడియో షేర్ చేసిన యంగ్ హీరోయిన్
  • whatsapp icon

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జంటగా నటిస్తున్న లేటెస్ట్ హై ఓల్టేజ్ చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). ఈ యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో విజయశాంతి (Vijayashanti) కీలక పాత్రలో నటిస్తుండగా.. దీనికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై అశోక వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కింది. అంతే కాకుండా రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రమోషనల్ వీడియో(Promotional video)ను షేర్ చేసింది హీరోయిన్ సాయి మంజ్రేకర్. మీ అమ్మకు ఇష్టమైన వ్యక్తి అవ్వాలంటే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో.. ‘మీ అమ్మకు ఇష్టమైన వ్యక్తిగా మీరు ఉండాలనుకుంటున్నారా..? నీకు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. మొదటగా మీ అమ్మతో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి.. అలాగే ఆమె ఏం చెప్పిన అమ్మ మీరే కరెక్ట్ అనండి. అమ్మ ఎప్పుడు కాల్ చేసిన మీరు ఎంత బిజీగా ఉన్నా వెంటనే ఆమె కాల్‌కి ఆన్సర్ చేయండి. ఇక ఫైనల్‌గా మా సినిమాను (అర్జున్ సన్నాఫ్ వైజయంతి) మీ అమ్మతో చూడిండి’ అంటూ చెప్పుకొస్తుంది. ప్రజెంట్ ఈ ప్రమోషనల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో.. క్యూట్ ప్రమోషన్స్ అంటున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News