Rukmini Vasant : విజయ్ ప్రియురాలిగా రుక్మిణి వసంత్..

‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో కన్నడ (Kannada)తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత్

Update: 2024-12-11 14:12 GMT

దిశ, సినిమా: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో కన్నడ (Kannada)తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasant). ఇక ఇటీవల ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా తమిళం (Tamil) లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రజెంట్ రుక్మిణి ‘ఎసీఈ’ (ACE) చిత్రంతో బిజీగా ఉంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఆరుముగ కుమార్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ బర్త్‌డే సందర్భంగా సినిమాలో హీరోయిన్ (Heroin) క్యారెక్టర్‌ (character)ను రివీల్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు చిత్ర బృందం. ఇందులో రుక్మిణి.. విజయ్ ప్రియురాలిగా కనిపించి ఆకట్టుకుంది. అలాగే.. తన అందం, నటనతో మరింత మెప్పించింది. కాగా.. క్రైమ్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యోగిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Tags:    

Similar News