Mokshagna Teja: అతన్ని పట్టిస్తే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ.. వైరల్‌గా మారిన మోక్షజ్ఞ ట్వీట్

నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj).

Update: 2024-12-16 13:42 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ సినిమాలో బలాయ్యకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘డేగ డేగ’ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్ 1లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ ఈ సినిమా గురించి ఓ పోస్ట్ పెట్టాడు. డాకు మహారాజ్‌ను పట్టిస్తే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News