'N' కన్వెన్షన్ కూల్చివేత పై స్పందించిన నాగచైతన్య.. దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదంటు షాకింగ్ కామెంట్స్

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-28 02:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అక్కినేని నాగ చైతన్య స్పందించారు. హైదరాబాదులో హిమాయత్ నగర్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చిన ఆయనను మీడియా ఈ విషయంపై ప్రశ్నించింది. దీనికి నాగ చైతన్య స్పందిస్తూ.. ఆ విషయం ఇప్పుడు వద్దని, ఎన్‌కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి నాన్న ఎక్స్(ట్విట్టర్)లో అన్ని వివరాలు చెప్పారన్నారు.

అదేవిధంగా డెస్టినేషన్‌ లేదా హైదరాబాద్‌లోనే మీ పెళ్లి జరుగుతుందా అని ప్రశ్న ఎదురైనప్పుడు ఇంకా ఏం నిర్ణయించుకోలేదన్నారు. ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో త్వరలోనే అందరికీ అన్నీ తెలుస్తాయన్నారు. అలాగే కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో మీరు ఎక్కువ కనిపిస్తున్నారు ఎందుకు అని అడిగినపుడు.. అలా ఏం లేదని, మేబీ నన్ను ఎక్కువ చూపిస్తున్నారు కావచ్చు అని చెప్పారు. ఇక తన నటిస్తున్న మూవీ ‘తండేల్‌’ గురించి ప్రశ్న ఎదురుకాగా.. తన ప్రస్తుత లుక్‌ తండేల్‌ కోసమేనని, ఇప్పటి వరకు తను చేసిన సినిమాలతో పోలిస్తే తండేల్‌ పాత్ర అత్యంత సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఇది నిజమైన కథ ఆధారంగా రూపొందుతోందని నాగచైతన్య వెల్లడించాడు.


Similar News