Pushpa 3 : " పుష్ప 3 " లో విజయ్ దేవరకొండ.. షాకింగ్ రిప్లై ఇచ్చిన రష్మిక

తాజాగా, ఈ ప్రశ్నలపై రష్మిక షాకింగ్ రిప్లై ఇచ్చింది.

Update: 2024-12-14 13:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) , హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna) కలిసి జంటగా నటించిన " పుష్ప 2 " ( Pushpa 2) సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది. హిందీలో అయితే ఎవరూ ఊహించలేని విధంగా చరిత్రను తిరగరాసింది. సుకుమార్ ( Sukumar) డైరెక్షన్ చేసిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి దేశంలోనే నెంబర్ 1 చిత్రంగా నిలిచింది. అయితే, పార్ట్ 2 క్లైమాక్స్ లో బాంబ్ పట్టుకుని ఓ వ్యక్తి కనిపించాడు. అతను ఎవరో కాదు " పుష్ప 3 " ( Pushpa 3) లో హీరో విజయ్ దేవరకొండ అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ ప్రశ్నలపై రష్మిక షాకింగ్ రిప్లై ఇచ్చింది.

ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప 2 క్లైమాక్స్ లో కనిపించి వ్యక్తి విజయ్ దేవర కొండనా అని అడగగా.. ఆమె " మీ లాగే నేను కూడా.. అతనెవరో తెలియదు. డైరెక్టర్ సుకుమార్ సీన్ సీన్ కు సస్పెన్స్ ఉండాలనుకుంటారు. లాస్ట్ మినిట్ వరకు ఆ విషయాన్ని ఎవరికీ రివీల్ చేయరు. " పుష్ప 2 " సీన్స్ కూడా షూట్ చేసే ముందు చెప్పేవాళ్ళు, మూవీ క్లైమాక్స్ లో అతన్ని చూసి నేను కూడా షాక్ అయ్యా.. ఇతనెవ్వరని " అంటూ ఎవరికీ అర్ధం కాకుండా భలే ఆన్సర్ చెప్పింది.

Tags:    

Similar News