స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్.. బ్లాక్ బ్యూటీ అంటూ నెటిజన్ల కామెంట్స్

‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-02-28 03:20 GMT
స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్.. బ్లాక్ బ్యూటీ అంటూ నెటిజన్ల కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ‘భరత్ అనే నేను’(Bharath Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు టాక్. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర(Sidharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటై 2023లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా కియారా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ వేసుకుని స్టైలీష్ లుక్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటికి..’స్టైలింగ్ అండ్ క్రియేటివ్ డైరెక్షన్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు బ్లాక్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కియారా పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Tags:    

Similar News