ఎక్కడికి వెళ్లినా రామ్ చరణ్ బ్యాగ్‌లో కచ్చితంగా అది ఉండాల్సిందేనట.. ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మనందరికీ సుపరిచితమే. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీతో మనముందుకు వచ్చి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మనందరికీ సుపరిచితమే. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీతో మనముందుకు వచ్చి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’(Peddi) మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రిద్ది సినిమాస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా(విదేశాలకు) అతని బ్యాగ్‌లో కచ్చితంగా కుక్కర్ ఉండాల్సిందేనట. ఎందుకంటే రోజులో ఒక్కసారి అయినా ఇండియా మీల్ తినకుండా రామ్ చరణ్ ఉండలేడట. అందుకే ఫారెన్ కంట్రీస్‌కు వెళ్లినప్పుడు తనతో పాటు ఓ కుక్కర్‌ను కూడా తీసుకెళ్లి అక్కడ మన ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మెగా ఫ్యాన్స్ మన ఇండియన్ ఫుడ్ అలా ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.