Rajamouli-Mahesh Babu: ‘SSMB29’ మూవీ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ssmb29’. దీనిని భారీ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి(Rajamouli) ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో, అంతర్జాతీయ మూవీలా రూపొందించే పనిలో ఉన్నారు. షూటింగ్ కోసం పలుచోట్ల తిరుగుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్(Pre-production) పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
కానీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదిగో, అదిగో అనే వార్తలు తప్పితే సినిమా టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలో.. తాజాగా, మహేష్-రాజమౌళి మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రేపు జనవరి 2న గురువారం ssmb29 చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం జరగబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉదయం 10 గంటలకు ఈ వేడుక జరగనుందని టాక్. ఇందుకు సంబంధించిన పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.
Read More ...
Namrata Shirodkar: ‘మీ అందరికీ మీరు కోరుకునే వాటన్నిటితో నిండిన సంవత్సరం కావాలి’: నమ్రత శిరోద్కర్