Raashi Khanna: బాలీవుడ్ సినిమాలే ముద్దు.. తెలుగు వద్దు అన్నట్టుగా నార్త్‌లో దూసుకుపోతున్ బ్యూటీ

‘ఊహాలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశీఖన్నా.

Update: 2025-03-15 15:52 GMT

దిశ, సినిమా: ‘ఊహాలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశీఖన్నా (Raashi Khanna). మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అగ్ర హీరోల (Top heroes) సరసన అవకాశం అందుకుని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక రీసెంట్‌గా ఆరణ్మనై-4 (Aranmanai-4) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశీఖన్నా.. ఈ సినిమాకు గాను అవార్డు కూడా అందుకుంది. ఇదిలా ఉంటే.. 2022లో వచ్చిన ‘పక్కా కమర్షియల్, థాంక్యూ’ వంటి చిత్రాల తర్వాత తెలుగులో మరో మూవీ అనౌన్స్ చెయ్యలేదు ఈ అమ్మడు.

కానీ, హిందీ అండ్ తమిళం(Tamil)లో మాత్రం వరుస ప్రాజెక్టులు చేస్తుంది. తిరు, సర్దార్, యోధ, ఆరణ్మనై-4, సబర్మతి రిపోర్ట్, అగత్యా వంటి చిత్రాలతో సందడి చేసింది. ప్రజెంట్ తెలుగులో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘తెలుసు కదా’లో నటిస్తుంది. తెలుగులో రెండేళ్ల తర్వాత చేస్తున్న ఏకైక ప్రాజెక్ట్ ఇది. అంతే కాదు మరో తెలుగు మూవీరి సైన్ చేసినట్లు టాక్ కూడా లేదు. హిందీలో మాత్రం ‘టైమ్’ అనే మూవీలో నటిస్తుంది. 12th హీరో విక్రాంత్ మాస్సేతో, అలాగే రాజ్ అండ్ డీకే హిట్ సిరీస్ ఫర్జీ సీక్వెల్లో కూడా నటించబోతుందని టాక్. ఇలా హిందీలో వరుస ప్రాజెక్టులు చేస్తూ.. తెలుగులో సంవత్సరాల గ్యాప్‌తో మూవీస్ చెయ్యడంతో.. బాలీవుడ్ (Bollywood) ముద్దు.. టాలీవుడ్ వద్దు అనుకుంటుందా రాశీ ఖన్నా అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Read More..

Samantha: కథకు ‘శుభం’ కార్డ్.. త్వరలోనే అందరికీ తెలుస్తుందంటూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News