Priyamani: ‘అనుపమకు ప్రాణం పోసిన నా అద్భుతమైన బృందానికి భారీ అభినందనలు’.. సీనియర్ హీరోయిన్

సీనియర్ నటి ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది.

Update: 2025-03-25 14:44 GMT
Priyamani: ‘అనుపమకు ప్రాణం పోసిన నా అద్భుతమైన బృందానికి భారీ అభినందనలు’.. సీనియర్ హీరోయిన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటి ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. ఈ నటి అప్పట్లో అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసి గొప్ప గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె కంటెంట్ ప్రాధాన్యతున్న సినిమాల్లోనే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో కూడా నటించి.. తన సత్తా చాటుతోంది. ప్రియమణి తెలుగులో అవకాశాలు తగ్గాక చాలా గ్యాప్ తర్వాత బుల్లితెరపై జడ్జిగా వ్యవహరించింది.

ఇక అనంతరం ఈ నటి భామా కలాపం అనే మూవీలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓటీటీలో కూడా విడుదలై.. మంచి రెస్పాన్స్ అందుకుంది. థ్రిల్లర్, డార్క్ కామెడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 2022 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది. అయితే ఇందులో ప్రియమణి అదిరిపోయే ఫర్మామెన్స్ ఇవ్వడంతో జనాల్లో మరింత క్రేజ్ దక్కించుకుంది. ఈ మూవీలోని స్టోరీ అంతా ప్రియమణి చుట్టే తిరుగుతుంది.

ఈ సినిమాకు అభిమాన్య దర్శకత్వం వహించగా.. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని సమకూర్చారు. అలాగే బ్రహ్మాజీ, సీరత్ కపూర్ తదిరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే తాజాగా ఈ మూవీలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ప్రియమణికి అవార్డు వచ్చింది. కాగా ఈ నటి సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

‘చాలా సంతోషంగా ఉంది @ottplayapp అవార్డ్స్ 2025, నాకు మొదటిసారిగా హాస్య పాత్రలో ఉత్తమ నటిగా అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు. వారు చెప్పినట్లుగా, మొదటిది ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. భామకలాపం దానిని మరింత మరపురానిదిగా చేసింది. అనుపమకు ప్రాణం పోసిన నా అద్భుతమైన బృందానికి భారీ అభినందనలు. ఈ పాత్రకు నా హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది’. అంటూ రాసుకొచ్చింది.  

Full View

Tags:    

Similar News