మార్క్ శంకర్ ఆరోగ్యం పై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

Update: 2025-04-13 05:14 GMT
మార్క్ శంకర్ ఆరోగ్యం పై పవన్ కళ్యాణ్  కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ( Mark Shankar) ఆరోగ్యం పై కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan). మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు... కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan).

తన కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం ( Mark Shankar Health ) ప్రస్తుతం నిలకడగా ఉందని క్లారిటీ ఇచ్చాడు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కొడుకు మార్క్ శంకర్ కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు అలాగే శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇలా ఇలా ఉండగా తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ( Mark Shankar) ను సింగపూర్ నుంచి నిన్న రాత్రి ఇండియా కు తీసుకువచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Full View

Tags:    

Similar News