Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి BIG అప్డేట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నికలకు ముందుకు మూడు భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2025-02-17 13:23 GMT
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి BIG అప్డేట్
  • whatsapp icon

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నికలకు ముందుకు మూడు భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓజీ, హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ 50శాతం పూర్తి కూడా చేశారు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోవడంతో షూటింగ్స్ పెండింగ్‌లో పడ్డాయి. అయితే ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతీ తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటికీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఉస్తాద్ కోసం సినీ ప్రియులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో.. తాజాగా, హరీష్ శంకర్ ఓ ఈవెంట్‌లో పాల్గొని పవన్ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌గా గెస్ట్‌గా వెళ్లిన హారీష్ శంకర్.. ‘‘ఉస్తాద్ భగత సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీశాం. ఆల్రెడీ ఈ సీన్ షూట్ కూడా పూర్తి చేశాం. అయితే గత కొద్ది రోజుల నుంచి ఉస్తాద్ షూటింగ్ ఆగిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం వర్క్ జరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక హరీష్ శంకర్ వీడియో వైరల్ కావడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Tags:    

Similar News