Nidhi Agarwal: ఆ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.. నిధి అగర్వాల్ ఆసక్తికర కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాతో బిజీగా ఉన్నాడు.

Update: 2025-02-15 07:01 GMT
Nidhi Agarwal: ఆ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.. నిధి అగర్వాల్ ఆసక్తికర కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాతో బిజీగా ఉన్నాడు. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ఇక యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్(Anupam Kher), బాబీ దేవోల్, నోరా ఫతేహి(Nora Fatehi) వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

కాగా ఈ సినిమా మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి హరిహర వీరమల్లు సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాలోని కొన్ని మలుపులు ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తాయి. కథ కూడా చాలా వేగంగా ఉంటుంది.

ఔరంగ జేబు ట్రాక్ ఒక భాగం మాత్రమే ఉంటుంది. పూర్తి సినిమా దానిపైనే ఆధారపడి ఉండదు. నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. కేవలం డ్యాన్స్‌కు మాత్రమే పరిమితమయ్యే పాత్ర కాదు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్ షూటింగ్ మొదటి రోజుది. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో హరిహర వీరమల్లు ఉత్తమమైనది. పవన్ కళ్యాణ్ నటన చూసి ఒక్కోసారి ఆశ్చర్యపోయే దాన్ని. ఎంత కష్టమైన సన్నివేశం అయినా మూడు నిమిషాల్లో నటించేస్తారు.

‘కొల్లగొట్టినాదిరో’(Kollagottinadhiro) పాట పెద్ద సెట్‌లో చిత్రీకరించారు. ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న డ్యాన్స్ నంబర్లు కూడా ఉన్నాయి. దీని కంటెంట్ అందరికీ నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News