ఒకే ఫ్రేమ్‌లో పెద్దోడు చిన్నోడు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదంటున్న నెటిజన్లు (పోస్ట్)

విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమా జనవరి 14న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-18 03:19 GMT
ఒకే ఫ్రేమ్‌లో పెద్దోడు చిన్నోడు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదంటున్న నెటిజన్లు (పోస్ట్)
  • whatsapp icon

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమా జనవరి 14న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వసూళ్ల విషయంలోనూ సత్తా చాటుకుని ముందుకు వెళుతుంది. ఇక ఈ సినిమా హిట్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాం టీమ్ సక్సెస్ పార్టీ(Success Party) చేసుకుంది. అయితే ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) విచ్చేశారు. ఇక ఈ మూవీ టీమ్ అతనితో ఫొటోలు దిగింది. అంతేకాకుండా వాటిని అనిల్ రావిపూడి తన ఇన్‌స్టా(Istagram) వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘హోస్ట్ బై పెద్దోడు.. గ్రేసెడ్ బై చిన్నోడు.. బ్లాక్ బస్టర్ సంక్రాతికి వస్తున్నాం సక్సెస్ పార్టీ విత్ సూపర్ స్టార్ మహేష్ బాబు’ అని రాసుకొచ్చాడు.

దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. ఒకే ఫ్రేమ్‌లో పెద్దోడు చిన్నాడు చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పార్టీకి మహేష్ బాబుతో పాటు భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar), నిర్మాత సురేష్ బాబు(Suresh Babu), డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally), మెహర్ రమేష్(Mehar Ramesh) తదితరులు పాల్గొని సందడి చేశారు. కాగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Full View

Tags:    

Similar News