కొత్త సినిమా పూజా కార్యక్రమంలో అలా చేసిన నయనతార.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(వీడియో)
స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న తాజా మూవీ ‘ముక్తి అమ్మన్-2’(Mookuthi Amman-2).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార(Nayanathara) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న తాజా మూవీ ‘ముక్తి అమ్మన్-2’(Mookuthi Amman-2). ఇది 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ముక్తి అమ్మన్’(Mookuthi Amman)కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా. ఇక దీనికి ఆర్జే బాలాజీ(Rj Balaji) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దీనికి నిర్మాత గణేష్(Ganesh). అయితే ఈ సినిమా కోసం నయన్ ఏకంగా నెలరోజుల పాటు ఉపవాసం చేస్తున్నారట.
ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నై(Chennai)లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమం వేడుక జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుందర్ సి(Sundar C)తో పాటు నటీమణులు నయనతార, మీనా(Meena), ఖుష్బూ(Khushboo), రెజీనా(Regina) సందడి చేశారు. అయితే సోషల్ మీడియా(Social Media)లో ఈ పూజా కార్యక్రమం వీడియోలు వైరల్‌గా మారాయి.
సాధారణంగా తన సినిమా పూజా కార్యక్రమం, ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయన్ ఉన్నట్టుండి ఈ వేడుకలో పాల్గొనడం అందరినీ షాక్‌కు గురిచేసింది. కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని ఆమె నమస్కరిస్తున్న వీడియోలు షేర్ చేస్తూ.. ఆమె నయనతారేనా.. ఇదేంటి కొత్తగా ఇలా చేస్తుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 22ఏళ్ల ఆమె కెరీర్‌లో ఆమె ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్‌ను మాత్రం దూరంగానే ఉండేవారట. ప్రాజెక్టుపై సంతకం చేసినప్పుడే ప్రమోషన్స్‌కు రాననే విషయాన్ని కూడా ఆమె టీమ్‌కు చెప్పెస్తారని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో ఈ మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు అంతటా షాక్‌కు గురిచేస్తుంది. మరి ఆ వీడియోను మీరు చూసేయండి.