Mad Square: ఆ సినిమా రిలీజ్ ఉంటే ‘మ్యాడ్ స్క్వేర్’ ఆపేస్తాం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగవంశీ

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్

Update: 2025-02-28 16:16 GMT
Mad Square: ఆ సినిమా రిలీజ్ ఉంటే ‘మ్యాడ్ స్క్వేర్’ ఆపేస్తాం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగవంశీ
  • whatsapp icon

దిశ, సినిమా: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’ (Mad)కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై సినీ ప్రియులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టకోగా.. తాజాగా వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత నాగవంశీ ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్‌పై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

ఈ మేరకు.. ‘మీ సినిమా (మ్యాడ్ స్క్వేర్) మార్చి 29న రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అదే డేట్‌కి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా కూడా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే వేళ అదే టైంమ్‌కి హరహర వీరమల్లు రిలీజ్ అయితే.. దానికి పోటీగా ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ చేస్తారా’ అని ప్రశ్నించారు ఓ విలేకర్. దీనిపై స్పందించిన నాగవంశీ.. ‘మార్చి 29కి హరిహర వీరమల్లు ఉందో లేదో వేణు గోపాల్‌ను అడగాలి. ఆయన అయితే రిలీజ్ ఉందని మాకు చెప్పలేదు. ఒకవేళ ఆయన ఉందని చెప్తే మేము రాము. కల్యాణ్ గారి ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. ఆయన సినిమా రిలీజ్ లేకపోతేనే మా సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ చేస్తాం’ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రజెంట్ నాగవంశీ కామెంట్స్ వైరల్ అవుతుంటే ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినీ ప్రియులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News