మరోసారి మంచు ఫ్యామిలిలో కలకలం.. మంచు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

డిసెంబర్ నెలలో హాట్ టాపిక్‌గా మారిన మంచు ఫ్యామిలి వివాధం.. మరోసారి తెరమీదకు వచ్చింది.

Update: 2025-01-15 16:14 GMT
మరోసారి మంచు ఫ్యామిలిలో కలకలం.. మంచు మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ నెలలో హాట్ టాపిక్‌గా మారిన మంచు ఫ్యామిలి వివాదం(The Manchu Family Controversy).. మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీ(Mohan Babu University)కి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించాడు. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం తెరమీదకు వచ్చింది. దాదాపు వందమందితో మంచు మనోజ్(Manchu Manoj) యూనివర్సిటీలోకి వెళ్లడానికి ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనకు సంబంధించి మంచు మనోజ్ పై ఆయన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మనోజ్ కోర్టు ధిక్కరణకు(Contempt of court) పాల్పడ్డారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో తెలిపారు. అలాగే 200 మందితో మోహన్ బాబు యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు మనోజ్ ప్రయత్నించాడని, న్యాయస్థానం ఆదేశాల మేరకు యూనివర్సిటీకి వెళ్లొద్దని పోలీసులు చెప్పినప్పటికీ మనోజ్ వినకుండా.. డైరీ ఫాం గేటును దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో రాసుకొచ్చారు.


Similar News