పెళ్లి కళ వచ్చేసిందే మేఘా.. శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
‘లై’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ అందరికీ సుపరిచితమే.
దిశ, వెబ్‌డెస్క్: ‘లై’ (Lie) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్((Megha Akash) అందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చల్ మోహన్ రంగ (Chal Mohan Ranga), రాజ రాజ చోర(Raja Raja Chora) , డియర్ మేఘా (Dear Megha) , గుర్తుందా శీతాకాలం(Gurthundha Seethakalam) , ప్రేమదేశం(Premadesham), రావణాసుర(Ravanasura), మనుచరిత్ర(Manu charithra) తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా తన ప్రియుడు సాయి విష్ణుతో(Sai Vishnu)ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో ఈ బ్యూటీ మూడు ముళ్లు బంధంలోకి అడుగుపెట్టనుంది. అందులో భాగంగా త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్న ఈ అందాల తార.. ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంకకు(Srilanka) వెళ్లింది. అక్కడే గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ(Batchelor Party) చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ముద్దుగుమ్మ మేఘా ఆకాష్ ఇన్‌స్టా వేదికగా తన బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు పెళ్లి కల వచ్చేసింది మేఘా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.