Meenakshi Chaudhary: శ్రీలీల మిస్ చేసుకున్న ఆఫర్ దక్కించుకున్న మరో క్రేజీ హీరోయిన్!
‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary)
దిశ, సినిమా: ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary).. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అవకాశాలు అందుకుంటూ.. ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ‘లక్కీ భాస్కర్’, ‘మెకానిక్ రాకీ’ వంటి మూవీస్‌తో అలరించిన హీరోయిన్.. త్వరలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’ (Anaganaga Okaraju). ఇందులో మొదట యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్‌గా ఫిక్స్ చేసి.. హీరోయిన్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే.. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి శ్రీలీల (Sree Leela) తప్పుకుందని, ఆ ప్లేస్‌లో మీనాక్షీ చౌదరిని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక ఈ వార్తల్లో ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.