బికినీలో హీట్ పుట్టిస్తోన్న మంచు విష్ణు హీరోయిన్.. లక్కీ హస్బెండ్ అంటూ కామెంట్స్
హీరోయిన్ సోనారిక భాడోరియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ నాగసౌర్య హీరోగా నటించిన ‘జాదుగాడు’ మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: హీరోయిన్ సోనారిక భాడోరియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ నాగసౌర్య హీరోగా నటించిన ‘జాదుగాడు’ మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మడు నటన, గ్లామర్ పరంగా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. దీంతో సినిమాల్లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘స్పీడున్నోడు’, ‘ఆడోరకం ఈడోరకం’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే అనుకున్నంత ఫేమ్ రాకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేసింది. అంతేకాకుండా బుల్లి తెరపై కూడా కొన్ని సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ‘మహాదేవ్' అనే సీరియల్‌లో పార్వతి దేవిగా ఎంతో పాపులర్ అయిన ఆమె హిందీలో మరెన్నో సీరియల్స్‌లో నటించి అలరించింది.
ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సోనారిక తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్‌ను పెళ్లి చేసుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బికినీ వేసుకుని బీచ్ ఒడ్డున తన అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టించింది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారగా.. లక్కీ హస్బెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ అమ్మడు బికినీ ఫొటోస్ పై ఓ లుక్ వేసేయండి.