Malaika Arora: తండ్రి ఆత్మహత్య.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ ప్రముఖ నటి అయినటువంటి మలైకా అరోరా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-12 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటి అయినటువంటి మలైకా అరోరా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ హిట్ మూవీ అయిన “గబ్బర్ సింగ్”లో కెవ్వు కేక అనే సాంగ్‌తో ఈ బ్యూటీ టాలీవుడ్ ఆడియెన్స్‌కి పరిచయం అయ్యారు. ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. దీంతో ఈమెకు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే మలైకా అరోరా కుటుంబంలో ఒక ఊహించని విషాద సంఘటన చోటు చేసుకుంది.

ఆమె తండ్రి అనిల్ అరోరా నిన్న ముంబై, బాంద్రాలోని తమ ఇంటి బిల్డింగ్ ఆరవ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటి మలైకా అరోరా తన తండ్రి మరణాన్ని దిగమింగుకోలేక ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో.. “నా ప్రియమైన తండ్రి అనిల్ మెహతా మరణించినట్లు తెలియజేయడానికి మేము చాలా చింతిస్తున్నాము. అతని సున్నితమైన ఆత్మకు శాంతి కలగాలని భావిస్తున్నాను. అతను అంకిత భావంతో ఉన్న తాత, ప్రేమగల భర్త అలాగే మా బెస్ట్ ఫ్రెండ్. ఈ నష్టంతో మా కుటుంబం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ కష్ట సమయంలో మీడియా, శ్రేయోభిలాషుల నుండి మేము గోప్యతను అభ్యర్థిస్తున్నాము. మేము మీ అవగాహన, మద్దతు, గౌరవాన్ని అభినందిస్తున్నాము. కృతజ్ఞతతో మీ బాయ్స్, మలైకా, అమృత, షకీల్, అర్హాన్, రేయాన్, అజాన్, క్యాస్పర్, ఆక్స్‌ఎల్, డఫీ& బడ్డీ" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కాగా ఈ పోస్ట్‌పై ప్రముఖ బాలీవుడ్ నటీ నటులతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to malaikaaroraofficial instagram id)



Similar News