Teja Sajja: తేజ సజ్జా ‘మిరాయ్’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. హిట్ ఖాయం అంటున్న నెటిజన్లు

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ‘జాంబిరెడ్డి’(Jambi Reddy) సినిమాతో హీరోగా మారాడు.

Update: 2025-02-22 07:42 GMT
Teja Sajja: తేజ సజ్జా ‘మిరాయ్’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. హిట్ ఖాయం అంటున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ‘జాంబిరెడ్డి’(Jambi Reddy) సినిమాతో హీరోగా మారాడు. ఇక గత ఏడాది వచ్చిన ‘హనుమాన్’ (Hanuman)చిత్రంతో ఘన విజయాన్ని సాధించిన ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘హనుమాన్’(Hanuman) భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ప్రశాంత్ వర్మ దీనికి సీక్వెల్‌ను కూడా తీసుకురాబోతున్నారు. ‘జై హనుమాన్’(Jai Hanuman) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishabh Shetty) హనుమాన్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్లు విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్ ది సూపర్ యోధ’(Mirai SuperYodha). ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ఇందులో తేజ సజ్జా సరసన రితిక నాయక్(Ritika Nayak) హీరోయిన్‌గా నటిస్తుంది. మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నాడు. అధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘మిరాయ్’ నుంచి పోస్టర్స్ తప్ప మరే అప్డేట్ విడుదల కాకపోవడంతో సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘మిరాయ్’ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఆగస్టు1న 2D,3D ఫార్మెట్‌లో ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అలాగే తేజ సజ్జా పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన మంచు కొండల మధ్యలో నిల్చొని పైపు లాంటి ఓ పరికరాన్ని పట్టుకుని కోపంగా చూస్తునట్లు కనిపించారు. అయితే ఈ సినిమా రక్షాబంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు హిట్ కొట్టడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News