Keerthy Suresh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్.. పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Update: 2024-11-29 07:05 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె శుక్రవారం ఉదయం స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. అలాగే పూజారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన పెళ్లి(Wedding)కి సంబంధించిన విషయాలను వెల్లడించారు. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. తన వెడ్డింగ్ గోవాలో జరగనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి.

కాగా, కీర్తి సురేష్ తన రిలేషన్‌షిప్(Relationship) గురించి తెలుపుతూ ఇటీవల ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంటోని(Antony)తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలియజేస్తూ దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా షేర్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక అది చూసిన వారంతా శుభాకాంక్షలు అందజేశారు. ఇప్పుడు డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న కీర్తి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News