తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సినిమాలో

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

Update: 2024-04-24 06:26 GMT
తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సినిమాలో
  • whatsapp icon

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకుంటూ వరుస ఆఫర్లు అందుకుంటుంది.

ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా అవకాశం కొట్టేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్‌ తెలుగులో మరో ఆఫర్ అందుకున్నట్లు టాక్. డైరెక్టర్ హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రాబోతున్న మూవీలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. కానీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More...

మహేష్ బాబు-రాజమౌళి మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ స్పెషల్ డే నాడు బిగ్ సర్‌ప్రైజ్! 

Tags:    

Similar News

Mira Rajput Kapoor

Viidhi

Sheetal Gauthaman