జాక్ నుంచి 'కిస్' సాంగ్ రిలీజ్.. రొమాంటిక్ లిరిక్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందిగా..

రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) మనందరికీ సుపరిచితమే.

Update: 2025-03-20 07:01 GMT
జాక్ నుంచి కిస్ సాంగ్ రిలీజ్.. రొమాంటిక్ లిరిక్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందిగా..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) డైరెక్షన్‌లో ‘జాక్-కొంచెం క్రాక్’(Jack Koncham Crack) సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇందులో యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది.

అయితే ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ప్రసాద్(BVS Prasad) నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఇందులో ప్రకాష్ రాజ్(Prakash Raj), బ్రహ్మాజీ(Brahmaji) వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ మూవీకి అచ్చు రాజమణి(Achu Rajamani) స్వరాలు సమకూర్చారు.

అయితే ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి ‘కిస్ సాంగ్‌’ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక వైష్ణవి చైతన్య, సిద్ధుల మధ్య రొమాంటిక్ డ్యూయెట్‌గా సాగిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను వినేయండి.

READ MORE ...

ప్రపంచ రికార్డు సృష్టించిన మహేష్ బాబు మూవీ.. వరల్డ్‌లోనే ఏకైక సినిమాగా ఘనత..

Full View
Tags:    

Similar News