హిందూ మతాన్ని స్వలాభం కోసం ఉపయోగించడం వేరు.. నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు.. దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-09-29 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పంజాబీ ముద్దుగుమ్మ అయినప్పటికీ టాలీవుడ్‌లో పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. అయితే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పేరుపై నిరంతరం పోస్టులు షేర్ చేస్తూ నిత్యం నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలనైనా సరే ధైర్యంగా తెలియజేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. ఆ టాలీవుడ్ డైరెక్టర్‌నే కాకుండా బడా హీరోలను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల తిరుపతి లడ్డు వివాదంలో కూడా పూనమ్ కౌర్ తన ట్విట్టర్ నుంచి చేసిన ఘాటు వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. ఈ క్రమంలో ఈమె మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా పూనమ్ X వేదికగా.. హిందూ మతాన్ని స్వలాభం కోసమే ఉపయోగించడం వేరు.. హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు అనే విధంగా ఒక కొటేషన్‌ని రాసి ట్వీట్ చేసింది. అయితే ఈమె ఇది ఎవరిని ఉద్దేశించి షేర్ చేసిందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి.. ముఖ్యంగా ఒక బడా హీరో పొలిటికల్ నేతని టార్గెట్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.



Similar News