Keerthy Suresh: ఈ విషయం తెలిసి షాక్ అయ్యా.. గుండె ముక్కలైనట్లుగా అనిపిస్తుంది.. కన్నీరు పెట్టిస్తున్న కీర్తి పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత ‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్‌గా మారింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత ‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. మొదటి మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంది. ఇక ‘మహానటి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో ఈ భామ సావిత్రి పాత్రలో నటించి తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీంతో తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటించి తన పాపులారిటీ పెంచుకుంది. గత ఏడాది ‘బేబీ జాన్’(Baby John) సినిమాతో వచ్చింది. అయితే ఈ మూవీ కోసం చాలా కష్టపడినప్పటికీ విజయం సాధించలేకపోయింది.
ప్రస్తుతం కీర్తి సురేష్, నితిన్(Nithin) సరసన ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నట్లు టాక్. అలాగే విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’లోనూ ఈ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కీర్తి సురేష్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా, మహానటి కీర్తి ఇన్‌స్టా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. థాయ్ లాండ్, మయన్మార్ దేశాల్లో భారీగా భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రతకు అక్కడి పెద్ద పెద్ద భవనాలు సైతం ఊగిపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా భారీ ఎత్తున సంభవించింది.
అయితే ఈ విషయం కీర్తి స్పందిస్తూ.. ‘‘మయన్మార్, థాయ్ లాండ్‌లో భీకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలిసి ముందు షాక్ అయ్యాను. అయితే అక్కడ భూకంపం రావడంతో అంతా చెల్లాచెదురైంది. వారి గురించి తల్చుకుంటూ ఉంటే.. నా గుండె ముక్కలైనట్టుగా అనిపిస్తుంది.. ఎంతో బాధగా ఉంది.. వారు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే ఈ భూకంపంలో ఏకంగా 1700 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
