పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న మెగా బ్యూటీ.. ఆ ఫొటోలు షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘షాపింగ్ మాల్’(Shopping mall) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

Update: 2025-03-23 04:11 GMT
పెళ్లి కాకుండానే  తల్లి కాబోతున్న మెగా బ్యూటీ.. ఆ ఫొటోలు షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘షాపింగ్ మాల్’(Shopping mall) సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత సూపర్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), వెంకటేష్(Venkatesh) కాంబోలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu)మూవీతో అంజలి రేంజ్ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.

వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల అంజలి ‘గేమ్ చేంజర్’(Game Changer) చిత్రంతో వచ్చింది. కానీ హిట్ సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు బాక్సాఫీసును షేక్ చేసిందనే చెప్పాలి. షూటింగ్ పూర్తి చేసుకున్న 12 ఏళ్ల తర్వాత వచ్చినప్పటికీ ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ప్రస్తుతం అంజలి చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు ఫొటోషూట్స్ చేస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. తాజాగా, అంజలి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో చాక్లెట్ కలర్ డ్రె ధరించిన ఆమె మత్తెక్కించే చూపులతో హాట్ పోజులిచ్చింది. అయితే అవి మాత్రం ప్రెగ్నెంట్ అయినట్లుగా ఉన్నాయని అంతా అభిప్రాయపడుతున్నారు. నువ్వు తల్లివి కాబోతున్నావ్ కదా.. బేబీ బంప్ కనిపిస్తుంది కంగ్రాట్స్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ సూపర్ ఉన్నావని అంటున్నారు. ప్రస్తుతం అంజలి పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Full View

Tags:    

Similar News