A DAY IN MY LIFE అంటూ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఆకట్టుకుంటున్న వీడియో
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలు, హెల్త్ రొటీన్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సమంత ఇన్‌స్టా వేదికగా A DAY IN MY LIFE అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అందులో మార్నింగ్ లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఆమె చేసే పనులన్నీ క్లియర్‌గా చూపించింది. అంతేకాకుండా దానికి లైఫ్ గోల్డెన్ (Life’s Golden ) అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరు ఈ వీడియోను ఓ సారి చూసేయండి.
(video link credits to samantha instagram id)