కన్నప్పలో ఒక పాట రాశాను.. కాదు కాదు శివయ్యే రాయించుకున్నాడు.. రామజోగయ్య శాస్త్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్

హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

Update: 2025-02-06 07:08 GMT
కన్నప్పలో ఒక పాట రాశాను.. కాదు కాదు శివయ్యే రాయించుకున్నాడు.. రామజోగయ్య శాస్త్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్
  • whatsapp icon

దిశ, సినిమా: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas), శరత్ కుమార్(sarathKumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రభాస్ లుక్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇతని గెటప్‌పై బాగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో నెట్టింట ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.

తాజాగా రామ జోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘దైవత్వాన్ని మించిన భావోద్వేగం లేదు.. శివయ్య కృప.. కన్నప్పలో ఒక పాట రాశాను.. కాదు కాదు..శివయ్యే రాయించుకున్నాడు. ఒకటే మాట.. మీరు కన్నప్పతో మమేకమై పూనకాలు చవిచూస్తారు, అంత గొప్పగా తయారయింది పాట.. శివార్పణమస్తు.. మంచు విష్ణు గారికి, స్టీఫెన్ దేవస్సీ గారికి నా హృత్పూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఆ పాటపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.

Tags:    

Similar News

Sonyaa

Jannat Zubair Rahmani