Salman Khan: రష్మికకు పెళ్లైనా వదిలిపెట్టను.. నెటిజన్లకు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. (వీడియో)
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) అందరికీ సుపరిచితమే. ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) అందరికీ సుపరిచితమే. ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సికందర్’(Sikander)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) తెరకెక్కిస్తున్నారు. దీనిని పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాజిత్ నదియవాలా (Sajit Nadiawala) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కీలక పాత్రలో కనిపించనుంది.
ఇప్పటికే ‘సికందర్’మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి సల్మాన్, రష్మికకు తండ్రిలా ఉన్నాడంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరి మధ్య 31ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సల్మాన్ విమర్శలపై రియాక్ట్ అయ్యారు. ‘‘గత కొద్ది రోజుల నుంచి నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.
నాకంటే రష్మిక 31 ఏళ్లు చిన్నదని అంటున్నారు. దానికి ఈ రోజు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. ఆమె తండ్రికి కూడా సమస్య లేదు.. వాళ్లకే లేని సమస్య మీకు ఎందుకు ?. రష్మికకే పెళ్లైనా నేను ఆమెను వదిలిపెట్టను ఆమెతో సినిమాలు చేస్తాను. అలాగే రష్మికకు కూతురు పుడితే కూడా ఆమెతో నటిస్తాను. వాళ్లకి లేని ప్రాబ్లం మీకేంటి?’’ అని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు నీ కామెంట్స్ గురించి తెలిస్తే విజయ్, రష్మికకు బ్రేకప్ చెప్పేస్తాడని కామెంట్లు పెడుతున్నారు.
Read More..