‘ఆ సమయంలో చాలా సార్లు ఏడ్చాను’.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘లైలా మజ్ను’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రిప్తి దిమ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-06 04:00 GMT

దిశ, సినిమా: ‘లైలా మజ్ను’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రిప్తి దిమ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస చిత్రాల్లో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటుంది. అయితే యానిమల్ సినిమాతోనే ఈ భామకు నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈభామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న సమస్యల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను నటించిన లైలా మజ్ను సినిమా వరకు నాకు నటన గురించి అంతంత మాత్రమే తెలుసు. అందుకే షూటింగ్ టైంలో చాలా గందరగోళానికి గురయ్యే దానిని. ఒక్కోసారి నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చి తప్పు చేశానా అనుకునేదాన్ని. సెట్లో భాష అర్థం కాక ఎన్నో సార్లు ఇంటికి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓసారి వర్క్‌షాప్‌కి లేట్‌గా వచ్చినందుకు నన్ను తిరిగి పంపించేశారు.

అప్పుడే ఇండస్ట్రీలో వర్క్‌తో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యం అని తెలుసుకున్నా. మనం అనుకున్నంత సులభం కాదు నటన. ఈ ప్రపంచంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది త్రీప్తి దిమ్రీ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ భామ నటించిన ‘లైలా మజ్ను’ సినిమా రీసెంట్‌గా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ఆడియన్స్‌ని మెప్పించి మంచి ఫేమ్ తెచ్చుకుంది.

Full View

Tags:    

Similar News