Samantha: ఆయన మాటలే నన్ను బలంగా మార్చాయి.. సమంత ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సడెన్‌గా ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) కన్నుమూశారు.

Update: 2024-11-29 13:30 GMT

Full View

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సడెన్‌గా ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ సమంత హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టడంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె గతంలో తన తండ్రి గురించి చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి.

‘‘నా మొదటి సినిమా ఏ మాయ చేసావే పెద్ద హిట్ అయ్యి, జనాలు నన్ను మెచ్చుకుంటున్నప్పుడు, ఆ విజయాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. ఆ విజయంలో నా మనసులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మీరు అండర్ అచీవర్(Underachiever), లేదా మీరు ఈ విజయం, ప్రశ్నలన్నింటికీ అర్హులు కాదు అని అన్నారు. ఆ రెండో మాటనే మనసులో పెట్టుకున్నాను. కెరీర్ మొదట్లో నా లుక్స్, యాక్టింగ్(Acting) విషయంలో నాపై నాకే అనుమానం కలిగింది.

నేను ఈ ప్రశంసలకు అర్హురాలిని అని నన్ను నేను నేను ఒప్పించుకోవడానికి 10-12 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో మా నాన్న జోసెఫ్ ప్రభు మాటలు నన్ను మరింత బలంగా మార్చాయి. ఇండస్ట్రీలో, నా జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలకు మా నాన్న అండగా ఉన్నారు ’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తండ్రి మరణించిన సమంతకు అభిమానులు, నెటిజన్లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Read More : Samantha: నటి సమంత ఇంట తీవ్ర విషాదం.. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో భావోద్వేగ పోస్ట్

Tags:    

Similar News