Meenakshi Chaudhary: నా ఫస్ట్ క్రష్ అతనే.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత హిట్, ఖిలాడి వంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. గత ఏడాది ఏకంగా గుంటూరు కారం, మెకానిక్ రాకీ(Mechanic Rocky), మట్కా, ది గోట్(The Greatest of All Time) సినిమాలు చేసింది. ఇక దుల్కర్ సల్మాన్‌తో నటించిన ‘లక్కీ భాస్కర్(Lucky Bhaskar)’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక విక్టరీ వెంకటేష్, మీనాక్షి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam).
అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో.. మూవీ టీమ్ అంతా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి తన ఫస్ట్ క్రష్ గురించి వెల్లడించింది. ‘‘నాకు స్కూల్ టైమ్‌లో ఓ టీచర్ అంటే క్రష్ ఉండేది. నా ఒక్క దానికే కాకుండా మా క్లాస్‌లో ఉన్న అమ్మాయిలందరికీ ఆయనపై అదే ఫీలింగ్ ఉండేది. అతనే నా ఫస్ట్ క్రష్ ఆ తర్వాత ఎవరిపై ఆ ఫీలింగ్ కలగలేదు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’లో నేచురల్‌గా యాక్ట్ చేశాను.
జీవితంలో అందరికీ ఏదో ఒక సమయంలో లవ్ స్టోరీ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనాక్షి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో మీనాక్షి తన ఫస్ట్ మూవీ హీరో అక్కినేని సుశాంత్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేసింది. కానీ అవన్నీ రూమర్స్ అని తేలడంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.