కారవాన్‌లో నేను బట్టలు మార్చుకుంటుంటే లోపలికి వచ్చాడు.. డైరెక్టర్‌పై టాలీవుడ్ హీరోయిన్ ఫైర్

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2025-04-02 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ షాలిని పాండే. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా కాకుండా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత ఆఫర్స్ రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది.

ఈ క్రమంలో తాజాగా తను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చింది. తన కెరీర్ మొదట్లో తాను బట్టలు మార్చుకుంటుంటే ఓ డైరెక్టర్ కారవాన్ లోకి పర్మిషన్ లేకుండానే డోర్ తీశాడని తెలిపింది. ఆ డైరెక్టర్ నేరుగా కారవాన్ లోకి రావడంతో .. తను కోపంలో అతనిపై అరిచేశానన్నారు. అంతే కాకుండా తనకి ఆ సినిమా ఆఫర్ కావాలంటే.. చెప్పింది చేయాలంటూ బెదిరించారని షాలిని తెలిపింది. ఇలా షాలిని పాండే చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అసలు సౌత్ లో తనని అంతలా ఇబ్బంది పెట్టిన దర్శకుడు ఎవరు అనేది మరింత హాట్ టాపిక్ గా మారింది.

Similar News