సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే(పోస్ట్)
స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్(Sunil), అర్జున్ దాస్(Arjun Das), రాహుల్ దేవ్(Rahul Dev) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ఈ సినిమాని థియేటర్లలోకి రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకు యూ/ఏ(U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మైత్రీ మైవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 140 నిమిషాలుగా సెన్సార్ బోర్డు నియమించింది. అదే సమయంలో అభ్యంతరకరంగా ఉన్న దాదాపు 2నిమిషాల సీన్స్ తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.