Ghaati: ‘ఘాటీ’మూవీ క్లైమాక్స్ షూట్‌ జరిగేది అప్పుడే.. వైరల్ అవుతున్న న్యూస్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

Update: 2025-01-19 07:55 GMT
Ghaati: ‘ఘాటీ’మూవీ క్లైమాక్స్ షూట్‌ జరిగేది అప్పుడే.. వైరల్ అవుతున్న న్యూస్
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు అనుష్క క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటి’(Ghaati) మూవీ చేస్తుంది. సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్(First Frame Entertainments) బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక లేడీ ఓరియెంటెడ్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది.

ఇక ఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ అయినాయట. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌ స్టార్ట్ చేయనున్నారట. ఈ షూట్ అనంతరం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెడతారట. అయితే అనుష్క తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది.

Tags:    

Similar News