శారీ నుంచి మొదటి సారి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ట్వీట్ వైరల్
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ప్రొడక్షన్‌లో LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ(Ravi Shankar Varma) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’(Saree).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ప్రొడక్షన్‌లో LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ(Ravi Shankar Varma) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’(Saree). దీనికి గిరి కృష్ణ కమల్(Krishna Kamal) దర్శకత్వం వహిస్తుండగా.. సత్య యాదు(Sathya Yadu), ఆరాధ్య దేవీ(Aaradhya Devi) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నిజజీవిత సంఘటన ఆధారాలతో సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
ఇప్పటికే శారీ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అయితే చాలా ఏళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసుకువస్తున్న సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న శారీ మూవీ ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాన్నుట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చి 21కి వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు ఆర్జీవీ. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. శారీ మూవీ నుంచి మొదటిసారి సాంగ్ ఈరోజు సాయంత్రం 5గంటలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.