మొహమంతా రక్తపు ధారలతో సన్నిలియోన్.. అయ్యే ఏమైందంటూ కంగారు పడుతున్న ఫ్యాన్స్ (పోస్ట్)

స్టార్ హీరోయిన్ సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-04 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్(Bollywood), టాలీవుడ్(tollywood), కోలీవుడ్(kollywood), మాలీవుడ్(Mollywood) ఇలా అన్ని భాషల్లోనూ నటిస్తూ.. యువతను ఉర్రూతలూగిస్తోంది. ఈమె తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ 2014లో ‘రాగిణి ఎంఎంఎస్-2’(Ragini MMS 2) అనే మూవీతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె నటనకు ముఖ్యంగా యువత ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే అంతకు మించి ఆమెపై వ్యతిరేకత కూడా వచ్చింది. దానికి కారణం ఆమె బాలీవుడ్‌లోకి రాకముందు సన్నీలియోన్ అశ్లీల చిత్రాల్లో నటించడమే. అయితే తర్వాత వాటిని వదిలేసి.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అలా అన్ని భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

ఇదిలా ఉంటే.. తాజాగా సన్నిలియోన్ ఇన్‌స్టా(instagram) వేదికగా ఓ పోస్ట్(post) పెట్టింది. అందులో మొహమంతా రక్తంతో ఉంది. అంతేకాకుండా "నా శ్రమకు ప్రతి ఫలమే ఈ రక్తం.. రక్తం, చెమట, కన్నీళ్లతో వచ్చిన శ్రమ మిమ్మల్ని బ్రాండ్‌గా తయారు చేస్తాయి" అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అలా మోహంపై రక్తపు ధారలతో ఉన్న సన్నిలియోన్‌ను చూసి ఫ్యాన్ ఏమైంది తనకు అంటూ కంగారు పడుతున్నారు.

కాగా ఈ ఫొటో ‘కొటేషన్ గ్యాంగ్’(QG) అనే మూవీ షూటింగ్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ సినిమా ద్వారానే సన్నిలియోన్ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

(video link credits to sunnyleone instagram id)


Similar News