స్టార్ హీరో విడాకులు.. నాకు తెలియకుండా డివోర్స్ ఎలా ఇస్తారంటూ భార్య సంచలన పోస్ట్

ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు.

Update: 2024-09-11 06:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండి విభేదాలతో విడాకులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే.. పెళ్లైన రెండు మూడేళ్లకే విడిపోయేవారు మరికొంత మంది. ఇదిలా ఉంటే.. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి 15 ఏళ్ల కాపురం తర్వాత తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్య ఆర్తి.. తన అంగీకారం లేకుండా తన భర్త విడాకుల ప్రకటన చేశాడంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్‌లో భాగంగా.. "నాకు తెలియకుండా, నా అంగీకారం లేకుండా మా పెళ్లి గురించి చేసిన పబ్లిక్ అనౌన్స్‌మెంట్ చూసి నేనే షాక్ అయ్యాను. 18 ఏళ్లు కలిసి ఉన్నాము. ఇలాంటి విషయాలను ఎంతో హుందాగా, గౌరవంగా, వ్యక్తిత్వంగా పరిష్కరించి ఉంటే బాగుండేది. కొన్ని రోజులుగా మా ఆయనతో నేరుగా మాట్లాడడానికి కూడా అవకాశం దొరికింది. మా వివాహ బంధం గురించి కుటుంబం గురించి కొన్ని మాట్లాడడానికి ప్రయత్నించాను. అయితే ఆ మాటలను ఆయన పట్టించుకోలేదు. ఇద్దరు పిల్లలను, నన్ను ఇలా గుడ్డిగా వదిలేసి, ఇలాంటి అనౌన్స్‌మెంట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. విడాకులు తీసుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయంలో నా ప్రమేయం అస్సలు లేదు. మా కుటుంబానికి ఇది అస్సలు మంచిది కాదు. కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కలహాలు వచ్చినా కలిసి ఉండాలనే నేను కోరుకున్నాను. నా క్యారెక్టర్‌ని కించపరిచేలా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఓ తల్లిగా నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ పిల్లలకే.. నా పైన వస్తున్న అడ్డమైన, ఆధారాలు లేని ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో బిడ్డలకు అవసరమైన మనో ధైర్యాన్ని ఇవ్వడమే నా ప్రధాన కర్తవ్యం. త్వరలో మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. ఏళ్లుగా మాకు అండగా నిలుస్తున్న అభిమానులకు, ప్రెస్, మీడియాకు థాంక్యూ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం.. మా కోసం ప్రార్థించండి.. మా ప్రైవసీని కాస్త గౌరవించండి" అంటూ స్టేట్‌మెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Full View

(video link credits to aarti.ravi instagram id)


Similar News