పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న ధనుష్.. హైప్ పెంచుతున్న ట్వీట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) వరుస సినిమాలు చేయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) వరుస సినిమాలు చేయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ‘రాయన్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక ఇటీవల ధనుష్ తెరకెక్కించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ థియేటర్స్‌లో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ధనుష్ ‘ఇడ్లీ కడై’(Idli Kadai) చిత్రంతో రాబోతున్నాడు. ఆయన స్వయం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. దీనిని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
దీనిని అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు ఇటీవల ధనుష్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంతో పాటు ఆయన ‘కుబేర’ (kubera) లోనూ నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో రష్మిక మందన్న, నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ధనుష్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా, ధనుష్ ఓ తెలుగు డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram)-ధనుష్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అభిమానులు ఆనంద పడుతున్నారు. కాగా, త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారితో చిత్రాలు చేసి హిట్స్ సాధించారు.
ధనుష్ - త్రివిక్రమ్...
— Telugu360 (@Telugu360) April 7, 2025
ఈ కలయికలో ఒక సినిమా వచ్చే అవకాశం వుంది.
ఈ మధ్య టాలీవుడ్ దర్శకులతో పని చెయ్యడానికి ఉత్యాహం చూపిస్తున్నాడు ధనుష్.
ఈ దారిలోనే త్రివిక్రమ్ పైపు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది#Dhanush #Trivikram pic.twitter.com/Jw30Dv8wtW