'N' కన్వెన్షన్ కూల్చివేత.. బిగ్‌బాస్ నుంచి నాగార్జునను తొలగించాలంటూ ప్రముఖ హేతువాది డిమాండ్

అక్కినేని హీరో నాగార్జునకు సంబంధించిన ‘N’ కన్వెన్షన్ శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-25 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగార్జునకు సంబంధించిన ‘N’ కన్వెన్షన్ శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్‌లోని మాదాపూర్‌లోని తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. అయితే హైడ్రా చర్యపై నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.

ఇదిలా ఉంటే.. చెరువును ఆక్రమించి N-కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని ప్రముఖ హేతువాది బాబు గోగినేని డిమాండ్ చేశారు. ‘అక్రమ కట్టడాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఆయన్ను ఎలిమినేట్ చేయాలి’ అంటూ 'X' లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా బాబు గతంలో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి 9 వారాలకే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు.

(video link credits to babu gogineni X account)


Similar News