Deepika Padukone: డెలివరీ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన దీపికా పదుకొణె.. షాకింగ్ వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) ప్రెగ్నెంట్ కావడంతో ‘కల్కి’(Kalki) సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన విషయం తెలిసిందే.

Update: 2025-01-26 15:34 GMT
Deepika Padukone: డెలివరీ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన దీపికా పదుకొణె.. షాకింగ్ వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) ప్రెగ్నెంట్ కావడంతో ‘కల్కి’(Kalki) సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ పాపకు దువా సింగ్(Dua Singh) అనే పేరు కూడా పెట్టింది. దీపికా ఆ పాప అలనా పాలనా చూసుకుంటూ మురిసిపోతుంది. సోషల్ మీడియా(Social Media)కు కూడా పూర్తిగా దూరం అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, దీపికా పదుకొణె(Deepika Padukone) డెలివరీ తర్వాత సబ్యసాచి 25వ ఫ్యాషన్ షో(Sabyasachi 25th Fashion Show)లో పాల్గొంది.

తెల్లటి దుస్తులు ధరించిన ఆమె చోకర్, క్రాస్ నెక్లెస్(Cross necklace), చేతికి బ్రాస్‌లెట్, కళ్లజోడుతో షాకింగ్ లుక్‌లో ర్యాంప్ వాక్ చేసింది. కాస్త బొద్దుగా మారి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం దీపికాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా సీనియర్ నటి రేఖ(Rekha)లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె కూడా ఇలాంటి అవుట్‌ఫిట్‌(Outfit)లోనే కనిపించింది. ఆమె దగ్గరే తెచ్చుకున్నావా అని దారుణం అంటున్నారు.

Tags:    

Similar News