Court Movie: ‘కోర్ట్’ నుంచి ప్రేమలో సాంగ్ అవుట్.. వీడియో వైరల్

నేచురల్ స్టార్(Nani) నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కోర్టు(Court- State vs A Nobody).

Update: 2025-02-15 04:08 GMT
Court Movie: ‘కోర్ట్’ నుంచి ప్రేమలో సాంగ్ అవుట్.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: నేచురల్ స్టార్(Nani) నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కోర్టు(Court- State vs A Nobody). ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్(Ram Jagadeesh) తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai kumar), రోహిణి(Rohini), హర్షవర్ధన్(Harsha Vardhan), శ్రీదేవి(Sridevi) వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

కాగా ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్(First Single) ‘ప్రేమలో’(Premalo) సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. కాగా ఈ పాట ఆడియో రైట్స్‌ను సరిగమప సౌత్(Sarigamapa South) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రియదర్శి విషయానికి వస్తే.. ‘మల్లేశం’(Mallesham), ‘బలగం’(Balagam), ‘జాతి రత్నాలు’(Jathi Ratnalu), ‘డార్లింగ్’(Darling), ‘35 చిన్న కథ కాదు’(35 Chinna Katha Kadu) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తన కామెడీ టైమింగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Full View
Tags:    

Similar News