థియేటర్‌లో ‘గోదారి గట్టు మీద’ సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన కపుల్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunnam) సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

Update: 2025-01-16 06:34 GMT
థియేటర్‌లో ‘గోదారి గట్టు మీద’ సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన కపుల్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
  • whatsapp icon

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunnam) సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఇందులో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి సాంగ్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘గోదారి గట్టు మీద రామసిలకవే’ అంటూ రమణ గోగుల(Ramana Gogula), మధుప్రియ(Madhu Priya) ఆలపించిన సాంగ్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ సాంగ్‌పై సెలబ్రిటీలు, నెటిజన్లు చాలామంది రీల్స్ కూడా చేసి తమ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ కూడా చేసుకున్నారు.

ఈ క్రమంలో ఈ పాటకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని చూడడానికి వెళ్లిన ఓ రొమాంటిక్ జంట థియేటర్‌లో సాంగ్ ప్లే అయిన సమయంలో స్టెప్పులతో అదరగొట్టింది. అచ్చం వెంకీ మామ, ఐశ్వర్య రాజేష్ చేసినట్టుగా చేసి ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధుల్ని చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News