Kannappa teaser: ప్రభాస్ లుక్ రాంపేజ్ అంతే.. పాన్ ఇండియా స్టార్‌తో నిండిపోయిన కామెంట్స్ బాక్స్

శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను ఆధారంగా చేసుకుని విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’

Update: 2025-03-01 15:39 GMT
Kannappa teaser: ప్రభాస్ లుక్ రాంపేజ్ అంతే.. పాన్ ఇండియా స్టార్‌తో నిండిపోయిన కామెంట్స్ బాక్స్
  • whatsapp icon

దిశ, సినిమా: శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను ఆధారంగా చేసుకుని విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ (Kannappa) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా కన్నప్ప నుంచి సెకండ్ టీజర్‌ (Second teaser)ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లోని ఒక్కో షాట్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్, శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించిన తీరు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ లాస్ట్‌లో రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ, బిజీయమ్, ఆ క్లోజప్ షాట్స్‌కు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు, సినీ లవర్స్ కూడా ఫిదా అవుతున్నారు. దీంతో కామెంట్స్ బాక్స్ మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నిండిపోయాయి... ‘ప్రభాస్ లుక్ రాంపేజ్ అంతే’ అని, ‘ప్రభాస్ అన్న కోసమైన సినిమా చూడాల్సిందే’ అని, టీజర్ మొత్తంలో ప్రభాస్ లుక్ హైలైట్‌గా నిలిచింది అంటూ ‘కన్నప్ప’ టీజర్ కింద.. ప్రభాస్ ప్రభాస్ అనే పేరుతో ఇన్‌బాక్స్ మొత్తం నిండిపోయింది. కాగా.. ‘కన్నప్ప’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Tags:    

Similar News

Shivaleeka Oberoi Pathak