Allu Arjun: మళ్లీ మళ్లీ చెబుతున్నా.. క్షమించండి
సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబాని(Revathi Family)కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరోసారి క్షమాపణ చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబాని(Revathi Family)కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరోసారి క్షమాపణ చెప్పారు. శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్ అని అన్నారు. బాధిత కుటుంబాన్ని తాము ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తాము ఏం చేసినా జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. గత 20 ఏళ్లుగా అదే సంధ్య థియేటర్‌కు 30 సార్లు వెళ్లానని అన్నారు. కానీ, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని తెలిపారు. కేసుల వివరాల గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు. మళ్లీ మళ్లీ చెప్తున్నా ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను అని భరోసా ఇచ్చారు.