పెళ్లి తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చిన చై- శోభిత.. వాళ్ల బిహేవియర్ పై నెటిజన్లు ఫైర్.. (వీడియో)
అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్ వేదికగా తెలియజేస్తూ వారి నిశ్చితార్థ ఫొటోలను షేర్ చేశాడు. అయితే ఈ జంట తాజాగా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. తాజాగా అనురాగ్ కాశ్యప్ కుమార్తె అలియా క్యాసన్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఫస్ట్ టైం నాగ చైతన్య- శోభితలు భార్యా భర్తలుగా కనిపించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
అయితే ఇందులో మరీ ముఖ్యంగా శోభిత డ్రెస్‌పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ డ్రెస్ ఏంటి.. పద్ధతిగా చీర కట్టుకోవచ్చుగా అంటూ ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే చాలా మంది చైతన్య బిహేవియర్ పై కూడా ఫైర్ అయిపోతున్నారు. ఫంక్షన్ మొత్తం శోభిత ధూళిపాళ వెనకనే తిరుగుతూ వచ్చాడు అని చైతన్యను అలా చూడలేకపోతున్నామంటూ మండి పడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం తన భార్య తన ఇష్టం.. తన వైఫ్ వెంట తిరగకుండా మీ వెనుక తిరగాలా అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.